ఇట్స్ అఫీషియల్ : తేజ్ ప్రేమలో పడ్డాడు

SAIసుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి తేజ్ ( I LOVE U) అనే టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. శనివారం (ఏప్రిల్-28) తేజ్ మూవీ ఫస్ట్ లుక్ ను  ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు హీరో సాయిధరమ్ తేజ్.

సాయిధరమ్ తేజ్ పేరునే సినిమా టైటిల్ గా ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లవ్ సినిమాల ఫేం కరుణాకరన్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఫస్ట్ లుక్ చూస్తుంటే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. క్యాప్షన్ లోనే తేజ్ I LOVE U అని ఉండటంతో సాయిధరమ్ తేజ్ మరోసారి లవ్ స్టోరీతో అలరించనున్నాడు అంటున్నారు. ఈ మూవీలో తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కే.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ నే మే 1న రిలీజ్ చేయనున్నట్లు టీమ్ తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy