ఇట్స్ అఫీషియల్ : దేవదాస్ రిలీజ్ డేట్

నాగ్, నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకు ఇటీవల దేవదాస్ అనే టైటిల్ పిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ తోనే క్రేజ్ సంపాధించుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది యూనిట్. గురువారం (జూలై-12) ట్విట్టర్ ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ మూవీని ..వైజ‌యంతి మూవీస్ బ్యానర్  పై అశ్వినీద‌త్ నిర్మిస్తున్నారు.

శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాలో నాని స‌ర‌స‌న ఛ‌లో ఫేం రష్మిక మందాన, నాగార్జున స‌ర‌స‌న ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. హైదరాబాద్ మెట్రో ట్రైన్‌ లో షూటింగ్ జ‌రుపుకున్న ఫస్ట్ మూవీ ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy