ఇట్స్ అఫీషియల్ : రోబో- 2 రిలీజ్‌ డేట్‌

శంకర్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా 2.ఓ. ఈ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చింది.  నవంబర్ 29న 2.ఓను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు శంకర్. బుధవారం (జూలై-11) సినిమా రిలీజ్ డేట్ ను అఫీసియల్ గా అనౌన్స్ చేసిన శంకర్..మూవీకి సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు.  ఈ సినిమా ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ప‌లు కార‌ణాల వ‌ల‌న విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. 2.0 సినిమా గ‌త ఏడాది ఆగ‌స్ట్‌ లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉంది. అయితే దీపావ‌ళికి రిలీజ్ అన్నారు. ఆ త‌ర్వాత మ‌ళ్ళీ వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 25న 2.ఓ విడుద‌ల అవుతుందని అనుకున్నప్ప‌టికి అదీ జ‌ర‌గ‌లేదు. ఈ దీపావ‌ళికి ప‌క్కా విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు భావిస్తుండ‌గా, కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల ఆనందాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు.  400 కోట్ల బ‌డ్జెట్‌ తో రోబో 2 ని తెర‌కెక్కించిన శంక‌ర్ రెండేళ్ల క్రిత‌మే షూటింగ్ పూర్తి చేశాడు. అయితే గ్రాఫిక్స్ ప‌నుల విష‌యంలో చాలా స‌మ‌యం ప‌డుతుంది.

2.ఓ గ్రాఫిక్‌ పనులు చూస్తున్న లండన్‌ సంస్థ ఓ సమస్యలో చిక్కుకుందని, అందువల్ల మరింత ఆలస్యమవుతుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. బాహుబ‌లి సినిమా క‌లెక్ష‌న్స్‌ని త‌ల‌ద‌న్నేలా రోబో 2  ఉంటుంద‌ని, ఈ సినిమా హాలీవుడ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy