ఇట్స్ అఫీషియల్ : వెంకీతో తమన్నా

VENKY TAMANNAవిక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా కలిసి నటిస్తున్న సినిమా ఎఫ్-2. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్స్ ను ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. ఇప్పటికే వరుణ్ సరసన మెహ్రీన్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేయగా..లేటెస్ట్ గా వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ గా తమన్నాను ఫిక్స్ చేశారు.

ఈ విషయాన్ని సోమవారం (మే-7) ట్విట్టర్ ద్వారా తెలిపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకటేష్, తమన్నా, వరుణ్, మెహ్రీన్ ఫోటోలను పోస్ట్ చేసి అఫీషియల్ గా ప్రకటించింది యూనిట్. ఫుల్ కామెడీ ఎంటర్టయినర్ గా రూపొందనున్న ఈ మూవీ..ఇప్పడు హీరోయిన్స్ గ్లామర్ తో మరింత ఎక్స్ పెక్టేషన్స్ మొదలయ్యాయి. వెంకటేష్ సినిమా అంటేనే కామెడీ ఎక్స్ పెక్ట్ చేసే ఫ్యాన్స్..అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని ఇటీవల డైరెక్టర్ చెప్పారు. జూన్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని, డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపింది యూనిట్.  ఈ సినిమాలో నటించే మరిన్ని క్యారెక్టర్లను త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకీ సరసన నటించే ఛాన్స్ రావడం ఎంతో ఎక్సయిటెడ్ గా ఉందని.. జూన్ వరకు ఆగడం తనవల్లకావడంలేదని ట్విట్ చేసింది హీరోయిన్ తమన్నా..

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy