ఇట్స్ ఫన్నీ : బాహుబలికి ఐటీ ఇండస్ట్రీ కొత్త అర్థాలు

bahuజ‌క్క‌న్న బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి క్రేజ్‌ను సంపాదించుకుందో తెలిసిందే. అదేస్థాయిలో  క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో అనే ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ నెటిజ‌న్ల‌కు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆ త‌ర్వాత బాహుబ‌లి మీద ఎన్నో ఫ‌న్నీ కామెంట్స్ కూడా నెటిజన్లు చేశారు. త‌మ క్రియేటివిటీ జోడించి త‌మ‌కు తోచిన‌ట్టుగా ఫోటోలు త‌యారు చేసి పోస్ట్ చేశారు.అయితే ఇదంతా స‌ర‌దాకోస‌మే చేశారు.

తాజాగా ఐటీ క‌న్ను బాహుబ‌లిపై ప‌డింది. నిత్యం ప్రోగ్రామింగ్‌ల‌తో బిజీగా ఉండే టెక్కీలు త‌మ క్రియేటివిటీని జోడించి బాహుబ‌లిలోని క్యారెక్ట‌ర్స్‌ను వారి ఆఫీసులో ఉండే ఎంప్లాయి నుంచి హెచ్ఆర్ మేనేజ‌ర్ వ‌ర‌కు పోలుస్తూ ఫ‌న్నీగా పోస్టులు పెట్టారు.

సాఫ్ట్ వేర్ కంపెనీలో బాహుబలి క్యారెక్టర్స్

ప్ర‌భాస్ (అమ‌రేంద్ర బాహుబ‌లి ): క‌ష్ట‌ప‌డే త‌త్వం. నైపుణ్య‌త క‌లిగిన సాఫ్ట్‌వేర్ డెవెల‌ప్ప‌ర్‌. ఒక‌వేళ రేటింగ్స్ ఇవ్వాల్సి వస్తే ముందు వ‌ర‌స‌లో అమ‌రేంద్ర బాహుబ‌లి ఉంటాడు. కానీ ఆఫీస్‌లో జ‌రిగే రాజ‌కీయాలు అమ‌రేంద్ర బాహుబ‌లిని తొక్కేశాయంటూ స‌ర‌దాగా కామెంట్ చేశారు టెక్కీలు.

రానా (భ‌ళ్లాల‌దేవ‌): బాహుబలి సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన భళ్లాలదేవ… సాఫ్ట్ వేర్ ఆఫీసులో మాత్రం తన క్యారెక్టర్‌ను చాలా ఇంట్రెస్టింగ్‌గా మ‌లిచారు టెక్కీలు. నైపుణ్య‌త క‌లిగిన వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ క‌ష్ట‌ప‌డేత‌త్వం కాదు. ఉద్యోగుల‌కు అప్రైజ‌ల్ కోసం ఇచ్చే రేటింగ్‌లో రాజ‌కీయాల‌కు తెర‌లేపే మ‌న‌స్త‌త్వం భ‌ళ్లాల‌దేవ‌ది.

నాజ‌ర్ (బిజ్జ‌ల‌దేవా):  బిజ్జ‌ల‌దేవ‌ను టీమ్ లీడ్ లేదా మేనేజ‌ర్‌గా టెక్కీలు డిజైన్ చేశారు. అడుగ‌డుగునా రాజ‌కీయాలు …అర్హ‌త లేకున్న త‌న వారికోసం ఎందాకైనా రాజ‌కీయాలు చేసేందుకు వెన‌క‌డాని మ‌న‌స్త‌త్వం బిజ్జ‌ల‌దేవ‌ది.

ప్ర‌భాక‌ర్ (కాల‌కేయ‌):   కాల‌కేయ సొంత వాణిజ్య భాష‌లో మాట్లాడే వ్య‌క్తి. ఎవ్వ‌రికీ అర్థంకాని  జావా సీ++ లాంటి కంప్యూట‌ర్ భాష మాట్లాడుతూ ఫ్లోర్‌పై ప్ర‌తి ఒక్క‌రితో గొడ‌వ పెట్టుకునే మ‌న‌స్త‌త్వం అని టెక్కీలు కాల‌కేయ క్యారె్క్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

సత్యరాజ్ (కట్టప్ప):  సినిమాలో క‌ట్ట‌ప్ప ఎలా అయితే రాజ్యం కోసమే అన్న‌ట్లు ఎంతో న‌మ్మ‌కంగా ఉంటాడో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి కూడా అంతే నమ్మ‌కంతో వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తిగా తీర్చిదిద్దారు టెక్కీలు. ఉద్యోగుల‌కు ఆన్‌సైట్‌పై విదేశాల‌కు వెళ్లే అవ‌కాశం వ‌స్తే వారికి అన్ని విధాల స‌హాయం చేసే గొప్ప మ‌న‌స్త‌త్వం మ‌న సాఫ్ట్‌వేర్ టెక్కీ క‌ట్ట‌ప్ప‌ది. క‌ట్ట‌ప్ప‌కు ఇత‌ర కంపెనీల నుంచి మంచి ప్యాకేజ్ వ‌చ్చినా త‌న‌ను న‌మ్ముకున్న కంపెనీని వ‌దిలి వెళ్లే ప్ర‌సక్తే లేద‌ని చెప్పే క్యారెక్ట‌ర్‌గా మ‌లిచారు టెక్కీలు.

రెండో ప్ర‌భాస్ (శివుడు): క‌ంపెనీలో ఫ్రెష‌ర్‌గా చేరిన వ్య‌క్తి. కొత్త‌లో ఏమీ తెలియ‌దు. ఆ త‌ర్వాత అదే కంపెనీలో ఎంతో నేర్చుకుంటాడు. కొత్త ప్రాజెక్టు త‌న‌కు ఎప్పుడు అప్ప‌గిస్తారా అని ఆతుర‌త‌గా ఎదురు చూసే వ్య‌క్తిగా డిజైన్ చేశారు టెక్కీలు.

ర‌మ్య‌కృష్ణ (శివ‌గామి):  సాఫ్ట్‌వేర్ కంపెనీలో  శివ‌గామి పాత్ర సీనియ‌ర్ టీమ్ లీడ‌ర్ లేదా సీనియ‌ర్ మేనేజ‌ర్. స్వ‌త‌హాగా దృఢ‌త్వం క‌లిగిన మ‌న‌స్త‌త్వం ఎంతో ప‌ట్టుద‌ల క‌లిగిన మ‌నిషి. ఒక ఉద్యోగికి అప్ప‌జెప్పిన ప‌నిని స‌కాలంలో పూర్తి చేసి క్ల‌యింట్ల విశ్వాసాన్ని పొంద‌గ‌లిగితే వారిని అన్ని విధాలా ప్రోత్స‌హించే మ‌న‌స్త‌త్వం. అంత‌కంటే మంచిగా ఫ‌లితాలు చూపిన ఉద్యోగికి మ‌రిన్ని వ‌రాలు ప్ర‌క‌టించే మ‌నిషిగా శివ‌గామి క్యారెక్ట‌ర్‌ను రూపొందించారు.

త‌మ‌న్నా (అవంతిక‌): అవంతిక‌ది హెచ్ ఆర్ మేనేజ‌ర్ క్యారెక్ట‌ర్ .అందంగా ఉండే ఈ మేనేజ‌ర్ కేవ‌లం ఉద్యోగులను రిక్రూట్ చేసే పాత్ర‌కే ప‌రిమితం చేశారు టెక్కీలు.

మొత్తానికి బాహుబ‌లి క్యారెక్ట‌ర్స్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉంటే ఎలాఉంటుందనే అంద‌మైన ఆలోచ‌న‌కు టెక్కీలు ఊపిరిపోసి ఫోటోల‌తో స‌హా పోస్టులు పెట్ట‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy