ఇడ్లీ జిందాబాద్.. హైదరాబాద్ లో ఇదే నెం.1

idlyహైదరాబాద్ సిటీలో టిఫిన్ సెంటర్లకు కొదవలేదు. స్టార్ హోటళ్ల నుంచి కాకా హోటళ్ల వరకు.. ఆఖరుకి రోడ్ సైడ్ అమ్మే సైకిల్ టిఫిన్ల వరకు ఎన్నో కనపడతాయి. అడుగు బయటపెడితే చాలు నోరూరించే టిఫిన్లతో కడుపు నింపేస్తున్నాయి. రకరకాల ఐటెమ్స్ టిఫిన్లలో వచ్చినా.. ఎవర్ గ్రీన్ మాత్రం ఇడ్లీయే అంటున్నారు నగరవాసులు. టిఫిన్లలో ఇడ్లీకే జిందాబాద్ అంటున్నారు. హైదరాబాద్ మహా నగరంలోని కోఠి, ఆబిడ్స్, హైటెక్ సీటీ, సికింద్రాబాద్, పాత నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా 60 శాతం మంది ఇడ్లీకి ప్రాధాన్యతనిస్తున్నారు. 20 శాతం మంది వడ, 20 శాతం మంది దోసె, ఉప్మా, పొంగల్, పూరీ, పండ్లరసాలు తీసుకుంటున్నారు. అయితే పాతబస్తీలో మాత్రం ఇప్పటికి మెజారిటీ పాయా షోర్వా, నాన్ కీ రోటీ, బోటీ రోటీనే నాస్తాగా తీసుకుంటారు. పాతబస్తిలో 60 శాతం మంది వాటికే జై కొడుతున్నారు. హైదరాబాద్ మహా నగరంలో ఉదయం ఐదు గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు తీసుకుంటున్న బ్రేక్ పాస్ట్ (అల్పాహారం)పై నిర్వహించిన ఒక సర్వే ద్వారా 60 శాతం మంది ఇడ్లీ ప్రియులే ఉన్నట్లు తేలింది. ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy