ఇతరులను తప్పుబట్టి ఎదగాలనుకోవడం చౌకబారుతనం

srireddy-and-ramcharanసినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా పరిశ్రమలోని కొందరి వ్యక్తులపై ఆరోపణలు చేస్తున్నారు కొందరు జూనియర్ ఆర్టిస్టులు. దీనిపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటి సారిగా  తన ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. ఇందులో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలున్నా వాటిని న్యాయబద్ధంగా…సంస్కార వంతంగా పరిష్కరించుకోవాలన్నారు. అయితే కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాపులర్ అవ్వాలని చూడటం చౌకబారుతనంగా ఉంటుందంటూ పోస్టు చేశాడు రామ్ చరణ్

అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోను ఈ పోస్టుతోపాటు పెట్టారు. ‘నన్ను తిడుతుంటే మీకు ఇబ్బంది కలుగవచ్చు. కానీ వాటిని నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. నేను భరిస్తాను. మనం భరిద్దాం. ఎదురుదాడి చేయకుండా భరిద్దాం’ అంటూ వీడియోలో పవన్‌ తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy