ఇది ఏమై ఉంటుంది : మనిషా.. తోడేలా..?

wolf-boy-1మలేషియా మీడియాలో వింత ఆకారం హల్ చల్ చేస్తోంది. ఎక్కడికి వెళ్లినా దాని గురించే చర్చించుకుంటున్నారు. మనిషిని పోలిన తల, తోడేలు పళ్లు, పిల్లిని పోలిన శరీరం ఇలా ఉంది ఆ వింత జీవి. కొందరు దాన్ని తోడేలు పిల్ల అంటే మరికొందరు పిల్లి పిల్ల అంటున్నారు. అయితే అది ఏంటనేది పూర్తిగా నిర్ధారించుకోలేకపోతున్నారు.

ఓ ఇంటి గార్డెన్ లో తిరుగుతుండగా దాన్ని వీడియో తీసి పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వెస్టర్న్ మలేషియాలో ఇది సంచరిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మలేషియన్ పోలీసులు మాత్రం ఈ వార్తను ఖండిస్తున్నారు. అలాంటి వింత జీవి ఏదీ ఉన్నట్టు తమకు సమాచారం లేదని.. సోషల్ మీడియాలో అనవసర పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు మాత్రం అది ఓ లాబరేటరీలో ఉన్నట్టు చెబుతున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy