ఇది ఓ తండ్రి విజయం : డ్రగ్స్ నుంచి కూతురికి విముక్తి

DRUGSకూతురు పుట్టిందని ఏమీ బాధపడలేదు. అల్లారు ముద్దుగా పెంచాడు. వీధివీధి తిరిగి కూరగాయలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే బాగా చదివిస్తున్నాడు. ఈ టైంలోనే ఈ కూతురు డ్రగ్స్ కి బానిసగా మారింది. డ్రగ్స్ కోసం ఏం చేయటానికి అయినా రెడీ అన్నట్లుగా ఎడిక్ట్ అయ్యింది. విషయం తెలిసిన తండ్రి చలించలేదు.. బాధపడలేదు. ఆ మహమ్మారి నుంచి కూతురిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. చివరికి విజేతగా నిలిచాడు. ప్రతి ఒక్కరికీ ఆదర్శ తండ్రిగా ఇప్పుడు ప్రపంచం ముందు నిలిచిన కమలహాసన్ స్టోరీనే ఇది..

బంగ్లాదేశ్ కి చెందిన  40 ఏళ్ల కమల్ హసన్ కి  పదేళ్ల శాంటా అనే కూతురు. తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో కూతురే ప్రాణంగా పెంచాడు. అయితే డ్రగ్స్ కి బానిస అయ్యింది. ఇంట్లో నుంచి వెళ్లిన కూతురు డ్రగ్స్ మత్తుతో తిరిగి వచ్చేది. ఓ సారి ఎనిమిది రోజులు కనిపించకుండా పోయింది. వెత‌క‌ని చోటు లేద‌ు. చివ‌ర‌కు డ్రగ్స్‌ బానిసలతో అడవిలో కనిపించింది. పేద‌రికంలో ఉండ‌డంతో ఆసుప‌త్రికి కూడా తీసుకెళ్ల‌లేద‌ు. దీంతో చేసేది లేక మొదట ఇంట్లో బంధించాడు. గొలుసులతో కట్టేశానని ఆ మధ్యన మీడియాకు వివరించాడు కమల్ హాసన్. ఇంట్లో బంధించిన 20 రోజులు కూతురికి జీవితం అంటే ఏంటీ అని చెప్పటంతోపాటు మంచి మంచి కథలు చెప్పేవాడు. బతకాలి అంటే పని చేయాలని.. కష్టపడితేనే జీవితం బాగుంటుందని.. డ్రగ్స్ కి బానిస అయితే ఆరోగ్యం చెడిపోతుందని నచ్చచెప్పాడు. మొదట్లో కొంచెం కఠినంగా వ్యవహరించిన కమలహాసన్ రోజులు గడిచే కొద్దీ కూతురిలో మార్పును గమనించి మంచి మాటలు చెప్పటం ఎక్కువ చేశాడు.

ఇలా నెల రోజుల తర్వాత కొద్దిగా మార్పు వచ్చింది. ఆ టైంలోని శాంటాను ఇంట్లో పనులను అప్పగించాడు. తనతోపాటు కూరగాయల వ్యాపారానికి తీసుకెళ్లేవాడు. తన దగ్గరకు వచ్చే కస్టమర్లతో శాంటాను మాట్లాడించేవాడు. వాళ్లు ఎలా కష్టపడుతున్నది.. తనతో ఎందుకు అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నది కూతురికి వివరిస్తూ ఉండేవాడు. నిద్రపోయే సమయంలో తప్పితే మిగతా టైం మొత్తం కూతురిని తన వెంటే పెట్టుకుని తిరిగేవాడు. డ్రగ్స్ ఆలోచన రాకుండా చేసేవాడు. అలా మూడు నెలలు కష్టపడ్డారు తండ్రి కమలహాసన్. అతని ప్రయత్నం వృధా కాలేదు. కూతురు మామూలు మనిషి అయ్యింది. డ్రగ్స్ బానిస నుంచి బయటపడింది. ఇప్పుడు ఒంటరిగా బయటకు పంపినా.. డ్రగ్స్ తీసుకోవటం లేదని గర్వంగా చెబుతున్నాడు ఈ తండ్రి.

ఇప్పుడు తండ్రి కూరగాయల వ్యాపారాన్ని శాంటానే చేస్తోంది. ఇటీవల సొంతంగా 3వేల 900 రూపాయలు సంపాదించిందని సగర్వంగా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కమలహాసన్. మొదట్లో కసాయి తండ్రి అంటూ లోకం మొత్తం తిట్టిపోసిందని.. ఇప్పుడు ఏమంటారని ఇదే సమాజాన్ని నిలదీస్తూ ఆయన పెట్టిన పోస్టులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

ఇది ఓ తండ్రి విజయగాధ మాత్రమే కాదు.. మార్పు కోసం పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యం ఏమీలేదని నిరూపించిన ఓ తండ్రి కథ కూడా.

అప్పుడు..

ఇప్పుడు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy