ఇది చేసుంటే.. H-1B వీసా చాలా ఈజీ

h-1b_visaH1B వీసాల కోసం ట్రై చేస్తున్న భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్. వీసాల విషయంలో ఇప్పటి వరకు కఠిన నిబంధనలతో విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపించిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు కాస్త మెత్తబడినట్టోంది. ఉద్యోగ ఆధారితంగా ఇచ్చే గ్రీన్ కార్డులు, H1B వీసాల నిబంధనలను సడలించడానికి రెడీ అవుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమ్యాటిక్స్ సబ్జెక్టుల్లో అమెరికా యూనివర్సిటీల నుంచి PhD పొందిన విదేశీయులను H1B నిబంధనల విషయంలో మినహాయించనున్నారు. దీనికోసం ప్రతినిధుల సభలో మరోసారి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ‘లీవింగ్ ది ఎకానమీ యాక్ట్(స్టాపల్)’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్, మైక్ క్విగ్లిలు. ఈ బిల్లుతో భారతీయ విద్యార్థులు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో PhDలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఎలాంటి సర్ ప్రైజ్ లేదని, ఇక్కడ ఎడ్యుకేట్ , ట్రైన్ చెందిన విద్యార్థులు, అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా తాము అన్ని చర్యలు తీసుకోనున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ పాల్సన్ చెప్పారు.

ఒకవేళ అమెరికా కొత్త కొత్త ఆవిష్కరణలను, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ లో పోటీదారుడిగా నిలవాలంటే, తాము కచ్చితంగా ప్రపంచంలో ఉన్న చురుకైన విద్యార్థులకు తమ కమ్యూనిటీల్లో చదువుకునేలా, పనిచేసేలా ప్రోత్సహించాల్సి  ఉందని క్విగ్లీ తెలిపారు. గతనెలే హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ ను దుర్వినియోగపరచకుండా కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ ట్రంప్  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకొచ్చారు. అమెరికాలో ఉద్యోగాలను కాపాడుకోవడానికి హైర్ అమెరికా నిబంధనలను తీసుకొస్తున్నట్టు చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy