ఇది నిజమే : ఒక్క పనస చెట్టు.. రూ.10లక్షల ఆదాయం

jackfruit_redకర్నాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలోని చెలూర్ గ్రామ నివాసి “పరమేష” జన్యు వైవిధ్య సంరక్షకుడిగా నామినేట్ అయ్యాడు. విలక్షణమైన లక్షణాలున్న పనస చెట్టును సంరక్షిస్తున్నందుకు పరమేషకు ఈ ఘనత దక్కింది. ఈ పనస చెట్టును 35 సంవత్సరాల క్రితం పరమేష తండ్రి సిద్దప్ప నాటారు. ఈ చెట్టు నుంచి వచ్చే పనస కాయల్లో ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. రుచిలో కూడా అద్భుతం. ఈ చెట్టు నుంచి వచ్చే పనసకాయలను పరమేష్ ఉచితంగా అందరికీ పంచి పెడుతుండేవాడు. ఈ చెట్టు పనసకాయలు తిన్న శాస్త్రవేత్తలు.. ఈ రకం చెట్లను పెంచటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇందుకు తగ్గట్టుగానే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ (కర్నాటక) డిపార్ట్ మెంట్ .. చెట్టు ఓనర్ అయిన పరమేష్ తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పనసకాయల ఉత్పత్తిని పెంచటంలో పరమేష్ కు సహాయసహాకారాలు అందిస్తారు శాస్త్రవేత్తలు. అందుకు సంబంధించి హార్టికల్చర్ శాఖ నుంచి 10వేల పనస నాట్లకు ఆర్డరు ఇచ్చింది. అందుకుగాను పరమేష్ కు రూ.10లక్షలు చెల్లించింది. తన జీవితాన్ని మార్చిన ఈ పనస చెట్టుకు తన తండ్రి పేరు అయిన సిద్దు అని పెట్టాడు. ఈ పనసకాయ బరువు కూడా కనీసం 10 నుంచి అత్యధికంగా 20 కేజీలు ఉంటుంది. విశేషం ఏంటంటే.. కాయలు తీసేస్తే చెట్టు బరువు కేవలం 3 కేజీలు మాత్రమే. మొత్తంగా ఓ చెట్టు.. ఓ జీవితాన్ని మార్చేసింది కదా..

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy