ఇది నిజమే… చిత్రగుప్తుడికో ఆలయం ఉంది

చిత్రగుప్తుడివి భలే విచిత్రమైన లెక్కలు. మన జీవితాల చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. అలాంటి చిత్రగుప్తుడి పేరు వింటే అందరూ భయపడాల్సిందే! కానీ ఆయన్ను ఉత్తర భారతదేశంలో కొందరు పూజిస్తారు. ఇది అక్కడి వరకే పరిమితమైందని అనుకోవద్దు. ఎందుకంటే మన తెలంగాణలో, అదీ హైదరాబాద్‌ లో చిత్రగుప్తుడికి ఒక గుడి ఉంది. పాతబస్తీలోని కందికల్ గేట్‌ దగ్గర ఉన్న ఈ ఆలయం ఒక వింత.250 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఇది.

నవాబుల కాలంలో మంత్రిగా ఉన్న రాజా కిషన్ పర్షాద్ దీన్ని డెవలప్ చేశారు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయంలో దీపావళి తర్వాత రెండో రోజున చిత్ర గుప్తుడి జయంతి వేడుకలు జరుపుతారు. యమ ద్వితీయగా ఆ రోజుని పిలుస్తారు. చిత్రగుప్తుడి ఆలయంలో వినాయకుడు, శివుడు కూడా పూజలు అందుకుంటున్నారు. ప్రతి బుధవారం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy