ఇది పద్దతి కాదు : కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్

kohli-fineటీమిండియా కెప్టెన్, IPL బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారీ జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్ మెంట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నాం అంటూ లేఖ ద్వారా తెలిపింది. ఈ జట్టుకి ఇలా జరిమానా విధించటం ఇదే ఫస్ట్ టైం అని కూడా వెల్లడించింది. ఈ సిరీస్ లో కోహ్లీ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు మాత్రమే గెలించింది.

బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన 206 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీం 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోనీ, రాయుడు రాణించటంతో చెన్నై టీం గెలించింది. ఈ సమయంలో స్లోగా బంతులు వేయటంతో.. ఎక్కువ టైం తీసుకున్నాడు కోహ్లీ. దీంతో ఈ ఫైన్ విధించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy