ఇది భారత్ విజయం : అగ్ని-5 ప్రయోగం సక్సెస్

5 SUCCESSనావిగేషన్‌, వార్‌ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఆదివారం (జూన్-3) ఉదయం ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం ఐలాండ్‌ లో ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ITR) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. రాడార్లు, ట్రాకింగ్‌ వ్యవస్థలతో పరిశీలించిన అధికారులు క్షిపణి నిర్ణీత దూరం చేరుకుందని, ప్రయోగం విజయవంతమైందని తెలిపారు.

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తోంది. ఆరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు తెలిపారు అధికారులు. రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు, క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షిణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మిసైల్ దానికి నిర్దేశించిన పూర్తి దూరాన్ని కచ్చితత్వంతో చేరుకుందని దీంతో ప్రయోగం భారీ విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంతో రక్షణ రంగంలో భారతదేశం అతి పెద్ద విజయం సాధించిందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy