ఇది విశ్వరూపమే: 57 సిక్సులు, 27 ఫోర్లతో 490 రన్స్ బాదేశాడు

Shane-Dadswellఆకాశమే హద్దు.. తుఫానులా చెలరేగాడు.. విధ్వంసం సృష్టించాడు.. దుమ్ము దులిపాడు.. ఇలాంటి పదాలు ఆ క్రికెటర్ కు అస్సలు సూటుకావు. అంతకుమించి ఏదైనా పదముంటే కనుక్కోవాలి. ఎందుకంటే అతను సాధించిన రికార్డు.. రికార్డుల రికార్డులనే తలదన్నేలా ఉంది. 57 సిక్సర్లు, 27 ఫోర్లతో 151 బంతుల్లో ఏకంగా 490 పరుగులు చేశాడు.  ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వండర్ ఇది.  దక్షిణాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల షేన్‌ డాడ్స్‌వెల్‌ సాధించిన రికార్డిది.  పాచ్‌ డార్ప్‌ అనే క్లబ్బుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో NWU జట్టుకు ఆడుతూ అతను విశ్వరూపం చూపించాడు. అతడి సహచరుడు రువాన్‌ హాస్‌బ్రక్‌ కూడా 54 బంతులే ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. దీంతో ఎన్‌డబ్ల్యూయూ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 677 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ మొత్తంలో 63 సిక్సర్లు, 48 ఫోర్లు నమోదయ్యాయి. బౌండరీల ద్వారా మాత్రమే 570 పరుగులు రావడం విశేషం. మూడు వికెట్లకు వరుసగా 194, 204, 220 భాగస్వామ్యాలు నమోదవడం గమనార్హం. ప్రత్యర్థి బౌలర్లలో నలుగురు 100కు పైగా, ఇద్దరు 90కి పైగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం పాచ్‌ డార్ప్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులే చేయడంతో NWU జట్టు ఏకంగా 387 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. డాడ్స్‌వెల్‌ ఈ సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన శనివారం అతడి పుట్టిన రోజు కావడం విశేషం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy