ఇది సంబరాల సమయం..!

telangana_celebrations-june2దశాబ్దాల కల నెరవేరిన క్షణం.. అమరులు ఆశయాల సాధించిన దినం.. తెలంగాణ రాష్ట్ర రూపంలో నాలుగు కోట్ల ప్రజలకు గొప్ప కానుక. 60 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా తెలంగాణ సంబరాలకు సిద్ధమయింది. పది జిల్లాల ప్రజలు సంబురాల్లో మునిగి తేలేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు ఎక్కడికక్కడ ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకునేందుకు ఆరేళ్ల పిల్లాడి నుండి 60 ఏళ్ల ముసలాడు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఎన్నో పండగలు చూసిన ప్రజలు తెలంగాణ పండగ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోనున్నారు. అర్ధ రాత్రి నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించి సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు.

కళాకారులు తమ ఆట పాటలతో తెలంగాణ వాదులను ఉత్సాహ పర్చనున్నారు. బతుకమ్మ పాటలు, ఉద్యమ గీతాలతో సోమవారం మారుమోగనుంది. కవులు తమ రచనలలో ఉత్తేజం నింపనున్నారు. ఆవిర్భావ దినోత్సవ రోజును చరిత్ర పుటల్లో లిఖించనున్నారు. ఇక ఉద్యోగులు మధ్యాహ్నం వరకు సంబురాల్లో పాల్గొని, ఆ తర్వాత విధుల్లో పాల్గొననున్నారు. ఇక సంబురాల్లో విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంగ్స్ కాంపిటిషన్, డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నారు. తీన్ మార్ దరువులు మోగుతుంటే చిందేసేందుకు సిద్ధమయ్యారు.

telangana-mapఇక రాజకీయ పార్టీలు కూడా ఆవిర్భావ దినోత్సవాలకు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకుంది. అదేరోజు సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో.. హైదరాబాద్ నగరమంతా గులాబిమయమైంది. అంతే కాకుండా ప్రతి జిల్లాలో ఉత్సవాలకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. గ్రామగ్రామాన టీఆర్ఎస్ జెండా ఎగరవేయనున్నారు. ఇక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపనుంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్యకర్తల్లో ఉంటూ సంబురాలు చేయాలని అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రతి జిల్లా కలెక్టర్ ఉత్సవాలను జరపనున్నారు. ఉద్యోగులు ఈ ఉత్సవాల్లో పాల్గొననునారు. రేపటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా పూర్తి స్థాయిలో అవతరించనుంది. 29వ రాష్ట్రంగా ఏర్పాటవుతున్న తెలంగాణ.. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగాలని కోరుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..!

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy