ఇది సెల్ఫీ కాదు.. ఎల్ఫీ..!

elphie650_650x400_41432281708

ఇదే ఎలిఫెంట్ తీసిన ఎల్ఫీ..!

లాస్ట్ ఇయర్ ఓ నల్ల కోతి సెల్ఫీ వికీపీడియా, ఆ ఫోటో ఓనర్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ ను సృష్టించింది. ఇప్పుడు అలాంటిదే ఎల్ఫీ చూస్తే మీరు అవాక్కవాల్సిందే. ఓ ఎలిఫెంట్ తీసిన ఎల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కెనడాకు చెందిన క్రిస్టియన్ లెబ్లాంక్.. థాయిలాండ్ లో చదువుతున్నాడు. సౌత్ ఈస్ట్ థాయిలాండ్ లోని ఓ ఐలాండ్ లో లెబ్లాంక్ ఓ ఎలిఫెంట్ కు అరటిపళ్లు తినిపిస్తూ ఫోటోలు తీస్తుండగా.. ఆ ఎలిఫెంట్ లెబ్లాంక్ సెల్ ఫోన్ లాక్కుందట. అప్పుడు ఆయన ఫోన్ టైమ్ లాప్స్ లో సెట్ చేసి ఉందట. అంతే వెంటనే పటా పటా ఎల్ఫీలు తీసిందట ఆ ఎలిఫెంట్. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ మంచి ఎల్ఫీని లెబ్లాంక్ షేర్ చేశాడు. దీంతో అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలాగే.. 2011 లో డేవిడ్ స్లేటర్ అనే ఫోటోగ్రాఫర్ నల్ల కోతుల ఫోటోలను తీస్తుండగా.. ఓ కోతి తన కెమరాను ఎత్తుకెళ్లింది. అంతటితో ఆగకుండా వందల ఫోటోలు క్లిక్ మనిపించిందా కోతి. వాటిలో కొన్ని సూపర్ ఫోటోలు అయ్యాయి. అందులోని ఓ నల్ల కోతి సెల్ఫీ వివాదాలకు దారి తీసింది. అయితే.. ఏదైనా ఓ జంతువు తీసుకున్న సెల్ఫీకి కాపీరైట్ ఉండదని యూఎస్ కాపీరైట్ ఆఫీస్ స్పష్టం చేసింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy