ఇదేం ఎండరా బాబు..!!

PTI5_15_2013_000064A_Kand_0ఎండదెబ్బతో శుక్రవారం 223 మంది మృత్యువాత

ఖమ్మం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం అత్యదికం

ఇంకా నాలుగైదు రోజులు ఇలాగే ఎండలు

ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉన్న ఎండ తీవ్రత

స్టేట్ లో భానుడి భగ భగలు కంటిన్యూ అవుతున్నాయి. టెంపరేచర్స్ ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకు పెరుగుతూపోతున్నాయి. ఎండతీవ్రతను తట్టుకోలేకపోతున్నారు జనం. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కాలు బయపెట్టాలంటేనే జంకుతున్నారు జనం. దీంతో అన్ని జిల్లాల్లో హై అలర్ట్ సిట్యుయేషన్ కనిపిస్తోంది. పనుంటే తప్పా..బయటకు రావడం లేదు. దీంతో కర్ఫూ వాతావరణం కనిపిస్తోంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా.. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో అయితే ఎండతీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో అత్యధికంగా..48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

మిగిలిన జిల్లాల్లోనూ… అదే సీన్. నిజామాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న 46.5 డిగ్రీలు నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మహబూబ్ నగర్ లో.. 45 డిగ్రీలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. ఎండదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండతీవ్రతను తట్టుకోలేక వడదెబ్బతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు మూడు రోజులుగా వడదెబ్బ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 223 మంది చనిపోయారు. నల్గొండ జిల్లాలో 67 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో..58 మంది వరంగల్ లో 32 మంది, కరీంనగర్ లో 24 మంది మహబూబ్ నగర్ లో..13 మంది చనిపోయారు.

హైదరాబాద్ లోనూ.. సేమ్ సిట్యుయేషన్.. నిన్నటికంటే టెంపరేచర్ ఇంకొద్దిగా పెరిగింది. శుక్రవారం 43.6 డిగ్రీలుగా రికార్డైంది. ఎపుడూ చూడని ఎండతో సిటీజనం పరేషాన్ అవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వాయువ్యం నుంచి వీస్తున్న వడగాల్పుల వల్లే ఎండతీవ్రత పెరుగుతూ పోతుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరో రెండు మూడు రోజులు ఇదే హీట్ కంటిన్యూ అయ్యే చాన్సుందంటోంది. సీన్ చూస్తే టెంపరేచర్ లో.. పదేళ్ల రికార్డులను తిరగరాసేలా పరిస్థితులున్నట్లు చెబుతున్నారు అధికారులు. ఎండలు ముదురుతుండడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది సర్కార్. అవసరమైతే ఉపాధి హామీ కూలీల పనివేళలు మార్చాలని అధికారులను ఆదేశించింది. ఎండ దెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సూచించింది. బాధ్యతను కలెక్టర్ లకు అప్పగించింది. ఈ సేవలో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy