ఇదేం చలిరా బాబు..!

Winter-Seasonచలి చంపేస్తోంది.  రాష్ట్రంలో నైట్ టెంపరేచర్స్ రోజు రోజుకీ పడిపోతున్నాయి. సాయంత్రం ఆరింటి నుంచే చలి వణికిస్తోంది. ఇక మధ్యరాత్రికి  ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉదయం 8 దాక మంచు కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బయటకు వెళ్తున్న వారు వణికిపోతున్నారు.

వారం రోజుల దాకా పగలు ఎండలు, రాత్రి అంతంత మాత్రంగానే చలి ఉండేది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారింది.  రాష్ట్రమంతటా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. టెంపరేచర్స్ పడిపోవడంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. శీతలగాలులతో సిటీ జనాలు గజగజలాడుతున్నారు. గంటకు 13కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు తోడవడంతో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు పడిపోయాయి. రాగల 48 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. చలిగాలులు పెరగడంతో స్వెటర్లు, జర్కిన్లకు గిరాకీ పెరిగింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy