ఇదో ఘోరం : అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక చిన్నారి మృతి

Ambulence-apఇదెక్కడి ఘోరమో.. ఆక్సిజన్ అందుబాటులో లేక ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లో ఆక్సిజన్ అందక వందల మంది చిన్నారు చినపోయారు. దేశం మొత్తం గగ్గోలు పెట్టేసింది. అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకి కూతవేటు దూరంలో జరిగింది. దేశవ్యాప్తంగా మరోసారి ఆక్సిజన్ లేక చిన్నారి మరణం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే..

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ శిశువుకి జన్మనిచ్చింది. అయితే పుడుతూనే బొడ్డుతాడును మెడకి చుట్టుకుంది. అత్యవసర చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వైద్యులు.. రాజధాని అయిన విజయవాడకి అంబులెన్స లో తరలించటానికి ఏర్పాట్లు చేశారు. 55కిలోమీటర్ల దూరం. అంబులెన్స్ లో శిశువుతోపాటు కేవలం అమ్ముమ్మ మాత్రమే వెళ్లింది. ఏలూరు దాటి 10కిలోమీటర్లు వెళ్లగానే అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్.. వెంటనే వెనక్కి తిరిగాడు. మళ్లీ ఏలూరు ఆస్పత్రికి వచ్చాడు. ఈలోపు శిశువు చనిపోయింది.

ఈ ఘటనపై వెలుగులోకి రావటంలో కలకలం రేగింది. అంబులెన్స్ లో తరలింపు సమయంలో కనీసం అంటే కనీస ప్రమాణాలు కూడా పాటించకపోవటం వల్లే శిశువు చనిపోయిందని అంగీకరించారు జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ.వి.ఆర్. మోహన్. అంబులెన్స్ లో సాఫ్ట్ లేకపోవటం కూడా కారణం అన్నారు. జరిగింది తప్పేనని ఒప్పుకున్నారు. ఇటీవలే ఆ ఆస్పత్రి 450 పడకలతో అప్ గ్రేడ్ అయ్యింది. బెస్ట్ ఆస్పత్రి అవార్డ్ కూడా తీసుకుంది. అలాంటి ఆస్పత్రిలోని అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక చిన్నారి చనిపోవటం విడ్డూరమా.. నిర్లక్ష్యమా..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy