ఇదో రివాజు

3imageఎన్నికలు జరిగే ముందు కొత్త పార్టీలు పుట్టుకువస్తున్నాయి. ప్రతి సారి ఎన్నికల ముందు ఇదో రివాజుగా మారింది. గడిచిన పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకోంది. 2000 సంవత్సరంలో తెలంగాణ ఆవిర్భావం కోసం టిఆర్ఎస్ వచ్చింది. ఆ తర్వాత టిడిపి నుండి బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్ ఎన్నికల ముందు పార్టీ పెట్టారు. అది ఎలక్షన్ తర్వాత అది మూతపడింది.

2009 ఎన్నికల టైంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఓపెన్ చేశాడు. అదీ ఎన్నికల తరువాత మూత పడింది. చివరకు చిరు కాంగ్రెస్ లో కలిశారు. దేవేందర్ గౌడ్ కూడా మళ్లీ టిడిపి గూటికి చేరుకున్నారు. ఇక అప్పట్లో విజయశాంతి కూడా తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. అదీ మూత పడింది. టీఆర్ఎస్ లో తన పార్టీని విలీనం చేయకతప్పలేదు. పాపం రాములమ్మ అటు ఇటు తిరిగి చివరకు కాంగ్రెస్ లో చేరింది.

ఎన్నికల ముందు కూడా మరో పార్టీ వచ్చింది. అది కూడా వైసీపీ పార్టీ. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీపై అలకతో జగన్ ఆ పార్టీని స్థాపించాడు. అది కూడా కాంగ్రెస్ లో కలుస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సారి కూడా ఎన్నికల ముందు రెండు, మూడు కొత్త పార్టీలు రాబోతున్నాయి. చిత్తూరు చిన్నోడు నల్లారి పార్టీ ఒకటి. మరోటి సినీ రంగం చింటుగాడు పవన్ కళ్యాణ్ ది మరోటి. మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న ఆ పార్టీల గాలి ఏ తీరానికి చేరుతుందో చూడాలి మరి. ఈ కొద్ది రోజుల పాటైనా వీరు జనాలను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అదే చాలనే వారు కూడా ఉన్నారు. వీరి సత్తా ఏంటో తేల్చుకోవడానికి లెటజ్ వెయిట్.

బుచ్చన్న, స్పెషల్ కరస్పాండెంట్
v6 news

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy