
తనను టచ్ కూడా చేయలేరని చంద్రబాబు అంటే తగిన శాస్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇష్యూకు ఆంధ్రా సెంటిమెంట్ ను బాబు జోడిస్తే తెలంగాణ లేబుల్ ను అంతకంటే పర్పెక్ట్ గా స్టిక్ చేశారు చంద్రశేఖర్ రావు. ఇక చివర్లో పంచ్ డైలాగులు బ్యాక్ టు బ్యాక్ మోత మోగాయి. ఏసీబీ నీకుంటే నాకూ ఉందని పోలీసులు నీకుంటే నాకూ ఉన్నారని చంద్రబాబు కేసీఆర్ ను హెచ్చరించారు. హైదరాబాద్ లో చంద్రబాబు పెడబొబ్బలు పెడితే భయపడేవాళ్లవెరూ లేరన్నారు కేసీఆర్. ఇద్దరు సీఎంల పవర్ ఫుల్ విమర్శలతో ఫోన్ ట్యాపింగ్ వివాదం సెగలు కక్కుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు సీఎంలు ఓ ఇష్యూపై ఈ స్థాయిలో విమర్శలకు దిగడం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది మొదలు డే బై డే వివాదం అప్ డేట్ అవుతూనే ఉంది. క్రైమ్ సీన్ లోకి చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతో కేసు కత్తిలా పదునెక్కింది. ఇది చివరకు ఏ టర్న్ తీసుకుంటుందోనని పదికోట్లమంది జనం ఊపిరిబిగబట్టుకుని చూసేంత స్థాయికి చేరింది.