ఇద్దరు సీఎంలు.. ఒక గవర్నర్

cm's with governorరెండు స్టేట్స్. ఒకే గవర్నర్. ఇద్దరు చీఫ్ మినిస్టర్స్. మధ్యలో గవర్నర్. పండగలొస్తే ఇద్దర్నీ పిలుస్తారు. గొడవలొస్తే పెద్ద మనిషిలా సర్దేస్తారు. లేటెస్ట్ గా మళ్ళీ మీడియేటర్ అయ్యారు. కానీ ఇది ఆంధ్రా – తెలంగాణ తగాదా కాదు. రాజధాని లొల్లి అసలే కాదు. అయినా మీడియేటర్ రోల్ లోకి వచ్చారు. ఎందుకు? ఎవరికోసం? దేనికోసం?

ఇప్పుడేమీ నీళ్ళ తగాదా లేదు. కరెంట్ పంచాయితీ లేనేలేదు. అంతా సాఫీగానే ఉంది. అయినా సరే, గవర్నర్ నరసింహన్ మధ్యవర్తి పాత్రలోకి రావడంమీద రెండురాష్ట్రాల రాజకీయనాయకుల్లో డిస్కషన్ నడుస్తోంది. నోట్ – ఓట్ గొడవను తేల్చేసే పని నరసింహన్ కు అప్పగించారట ప్రధాని మోడీ.

నోట్ – ఓట్ గొడవలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హాండెడ్ గా దొరికిపోవడం, దీనిలో ఏపీ సీఎం చంద్రబాబు ఇన్ వాల్వ్ మెంట్ ఉందనే ప్రచారం జరగడంతో హైదరాబాద్ లో మొదలైన రచ్చ ఢిల్లీ వరకు పాకిపోవడం  అందరూ చూసిందే. వెంటనే ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కేసిన చంద్రబాబు అక్కడ ఫుల్ లాబీయింగ్ చేశారు. ప్రధానితో ఏకంగా గంటపాటు ఏకాంతంగా మాట్లాడారు. ఈ గొడవనుంచి తనను ఎలాగోలా బయటపడేయాలని మోడీని బాబు వేడుకున్నట్టు, దానిక మోడీ సరేనన్నట్టు చానల్సన్నీ గుప్పుమన్నాయి.

గవర్నర్ నరసింహన్  నోట్ – ఓట్ మీద ఒక నోట్ ప్రధానికి ఇచ్చారట. ‘ఇదేదో మీరే సర్దేయండి’ అని నరసింహన్ కు మోడీ చెప్పారట. అందుకే ఇద్దరు చీఫ్ మినిస్టర్లనీ వేరేవేరుగా పిలిపించారు గవర్నర్. ఎందుకు? నచ్చచెప్పడానికా? రాజీ కుదర్చడానికా?

ఇక్కడే కొన్ని ప్రశ్నలొస్తున్నాయ్. లీగల్ విషయాల్లో పండిపోయినవాళ్ళు వేస్తున్నారీ ప్రశ్నలు. ఇదో అవినీతి కేసు. ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి అడ్డంగా దొరికిపోయిన కేసు. ఏసీబీ ఎంతో ప్లాన్ చేసి పకడ్బందీగా నడిపిస్తున్న కేసు. అలాంటిది, ఈ కేసులో గవర్నర్ జోక్యం చేసుకోవచ్చా? అనేది లీగల్ ఎక్స్ పర్టులు వేస్తున్న మొదటి కొశ్చన్. ఓ ఎమ్మెల్యేను కొనేయడానికి ట్రయ్ చేస్తూ దొరికిపోయిన దొంగల్ని వదిలేయాలని గవర్నర్ చెప్తున్నట్టు   అనుకోవాలా? అనేది రెండో కొశ్చన్.

అసలు రాజీ కోసం గవర్నర్ స్థాయి వ్యక్తి ఎందుకు ప్రయత్నించాలి? అదీ ఓ సీఎంని కాపాడడానికి ఇలాంటి రాజీ అవసరమా? ఇలా చేస్తే జనంలోకి ఎలాంటి సిగ్నల్స్ వెళతాయి? అని కూడా లీగల్ పండితులు నిలదీస్తున్నారు. పబ్లిక్ గా దొరికిపోయిన దొంగల్ని రెండు స్టేట్స్ లో జనమంతా టీవీల్లో చూశారు. ఇలాంటి కేసులో జోక్యం చేసుకుంటే జనానికి ప్రభుత్వంమీదా, ప్రజాస్వామ్యంమీదా నమ్మకం ఉంటుందా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా, విడిపోయాక రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా పనిచేస్తున్న నరసింహన్ ఈ నోట్ – ఓట్ కేసును ఎలా డీల్ చేస్తారో చూడాలని రెండు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy