ఇన్ స్పైర్ చేసే చిచ్చరపిడుగు… ఐదేళ్లకే సిక్స్ ప్యాక్

అతడి పేరు ఆరత్ హొస్సేనీ. రెండేళ్ల వయసునుంచే వరల్డ్ ఫేమస్ అయ్యాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలతో అందరికీ షాకిచ్చాడు. మల్టీ టాలెంట్ తో వండర్ కిడ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇపుడు పెద్దోడవుతున్నాడు. పెద్దోడంటే మరీ పెద్దకాదు. ఇపుడు ఐదేళ్లొచ్చాయి. అప్పుడే పొట్టపై సిక్స్ ప్యాక్ పెంచేశాడు. ఫిట్ నెస్ కు జిరాక్స్ కాపీ ఈ చిచ్చరపిడుగు. వయసుకు మించిన పరిణతితో… ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్య పరుస్తున్నాడు ఈ బుడ్డోడు.

హై ఎనర్జిటిక్ కిడ్ సక్సెస్ సీక్రెట్ వాళ్ల నాన్నే. ఆయన ట్రైనింగ్ లోనే రాటుదేలుతున్నాడు ఆరత్. ఎదురుగా ఉన్న చిన్న స్టూల్ పైకి ఎగిరి దుంకే వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అది చాలామందిలో కాన్ఫిడెన్స్ నింపే వీడియో. అలాంటి వీడియోలు లెక్కకు మించి ఉన్నాయి. Arat.gym ఇన్ స్టగ్రామ్ అకౌంట్ లో ఆరత్ విన్యాసాలు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.

ఉన్నచోట నుంచి ఎగిరి బ్యాక్ ఫ్లిప్ అవుతాడు. స్పైడర్ మ్యాన్ కంటే వేగంగా గోడలు ఎక్కుతాడు. ఫుట్ బాల్ అంటే ఆరత్ కు చాలా ఇష్టం. తోటి ప్లేయర్లను కన్ ఫ్యూజ్ చేసి గోల్ ఎలా కొడతాడో చూసి వావ్ అనాల్సిందే. ఆరత్… క్రిస్టియానో రొనాల్డోఫ్యాన్. ఫుట్ బాల్ ప్లేయర్ కావాలన్నదే అతడి ఇంట్రస్ట్.

బాక్సింగ్ లో, స్టంట్స్ లోనూ ఆరత్ కు తండ్రి ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఈ ఇన్ స్టగ్రామ్ అకౌంట్ లో 1.9మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. మిగతా సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆరత్ కు సంబంధించిన ప్రతి వీడియో జనాన్ని ఇన్ స్పైర్ చేసేదే.

View this post on Instagram

Love Soccer ⚽️ @cristiano

A post shared by Arat (@arat.gym) on

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy