ఇప్పటి వరకూ… ఆ ఒక్క రాష్ట్రంలో పర్యటించని వెంకయ్య

శనివారం(ఆగస్టు-11) నాటికి ఉపరాష్ట్రపతిగా ఏడాది పదవి కాలం పూర్తి చేసుకున్నారు వెంకయ్యనాయుడు.. ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన వెంకయ్య…పార్లమెంట్ లో పనిచేయడానికి రెండు విధానాలు మాత్రమే ఉన్నాయన్నారు. టాక్ అవుట్, వాక్ అవుట్ బట్ నో బ్రేకౌట్ (బయటకు మాట్లాడటం లేదా బయటకు వెళ్లిపోవడమే కానీ సభకు అంతరాయం కలిగించకూడదు) అని వెంకయ్య అన్నారు. మెత్తం ఏడాదిలో 313 కార్యక్రమాల్లో పాల్గొంటే… 60 శాతం విద్యార్థులు, యువత, రైతులు, పరిశోధన, సంస్కృతికి సంబంధించినవే కావడం విశేషం. ఏడాది పదవీకాలాన్ని ఎఫెక్టీవ్ ఎంగేజ్ మెంట్ గా వెంకయ్య వర్ణించారు. ఏడాది ఉపరాష్ట్రపతి పదవీ కాలంలో దేశంలోని 28 రాష్ట్రాలలో వెంకయ్య పర్యటించారు. ఒక్క సిక్కింలో మాత్రం వెంకయ్య పర్యటించలేదు. ఇప్పటివరకూ ఏ ఉపరాష్ట్రపతి కూడా ఏడు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించలేదు. అయితే సిక్కిం మినహా మిగతా 6రాష్ట్రాల్లో వెంకయ్య పర్యటించారు. లాటిన్ అమెరికా దేశాలైన గ్వాటెమాలా, పనామా, పెరూ దేశాలను వెంకయ్య విజిట్ చేశారు. అయితే గ్వాటెమాలా, పనామా దేశాలను మన దేశం నుంచి అత్యున్నత హోదాలో సందర్శించిన తొలి వ్యక్తి వెంకయ్య కావడం విశేషం. శనివారం వెంకయ్య నివాసంలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy