ఇప్పటి స్టార్స్ అంతా ఒకప్పటి మోడల్సే..!!

గ్లామర్ తో స్క్రీన్ ను కుమ్మేస్తున్న సెలబ్రిటీలంతా…మినిట్స్ యాడ్స్ చేసినవాళ్లే. పెద్ద పెద్ద స్టార్స్ కాకముందు చిన్న చిన్న క్యారక్టర్స్ కు ప్రాణం పోసినవారే. ఇప్పుడు గ్లామర్ తో దుమ్మురేపుతున్న ప్రతి హీరోయిన్ యాడ్స్ యాంగిల్ లో స్టార్ అయిందే.

Deepika-Padukone-v2దీపిక డింపుల్స్ మనం ఓం శాంతి ఓం లో కాదు ముందే చూశాం. అయితే గుర్తుపట్టలేదంతే. కమర్షియల్స్ తోనే అమ్మడు లైఫ్ స్టార్ట్ చేసింది. టూత్ పేస్ట్ యాడ్ తోనే అమ్మడు బీటౌన్ ను షేక్ చేయడం స్టార్ట్ చేసింది. మోడలింగ్ చేస్తూనే కమర్షియల్ యాడ్స్ కు ఆటోగ్రాఫ్ ఇచ్చేది. ఓం శాంతి ఓం తో బీటౌన్ లో లెగ్గేసి ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా సెటిలవుతోంది దీపూ బేబి.

Aishwarya-Rai-Face-Wallpaperఇక ఐశ్వర్య అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అమ్మడు ఫస్ట్ పక్కా కమర్షియల్ పెప్సీ యాడ్ కు సైన్ చేసింది. ఈ యాడ్ చాలా స్పెషల్. ఈ యాడ్ ఇద్దరి స్టార్స్ కు లైఫ్ ఇచ్చింది. కమర్షియల్ లో కూడా బడా హీరోతో జోడి కట్టింది ఐష్. అమీర్ ఖాన్ కూడా స్క్రీన్ కు ఫస్ట్ లుక్ ఇచ్చింది ఈ యాడ్ లోనే. మహిమా చౌదరి, ఐష్, అమీర్ ముగ్గురికి బ్రేక్ ఇచ్చిన యాడ్ పెప్సీ. దీనిలో చివర్లో ఎంట్రీ  ఇచ్చినా ఐష్ అందం జనాన్ని టచ్ చేసింది. స్టార్ హీరోయిన్ ను చేసింది.

M_Id_435824_Priyankaప్రియాంకా చోప్రా… వాటికా హెయిర్ ఆయిల్ యాడ్ తోనే స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది. అమ్మడు ఆ యాడ్ లో దేశీ గాళ్ లా అనిపించినా ఆన్ స్క్రీన్ లో మోడ్రన్ లుక్ తో చంపేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది.

 

IndiaTvdbffaf_katrina-kaifకత్రీనా కైఫ్ …కైఫ్ కైపు కళ్లు ఫస్ట్ చూసింది ఫెవికాల్ యాడ్ లోనే. అమ్మడు అందాలకు పెళ్లి కొడుకు ఎలా ఫిదా అయిపోయాడో ఈ యాడ్ లో చూపించాడు. ప్రొడక్ట్ ను సపోర్టు చేసుకుంటూనే కైఫ్ కు కెరియర్ ఇచ్చింది ఫెవికాల్. అందుకేనేమో సినిమా ఫీల్డ్ లో అతుక్కుపోయింది.

shahrukh-khan-to-return-to-televisionషారుఖ్ ఖాన్ బుల్లి యాడ్ లోను హీరో నే. మోటర్ బైక్ యాడ్ తో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. సింగిల్ డైలాగ్ తో సూపర్ స్టార్ డమ్ కొట్టేశాడు. బీటౌన్ బాద్ షా కు కెరియర్ ప్లాన్ పడేలా చేసింది ఈ మోటర్ బైక్ యాడే.

 

882369-salmankhan-1430984366సల్మాన్ కూడా కూల్ డ్రింక్ తో కూల్ చేసినవాడే. నాలుగు నిమిషాల యాడ్ తోనే ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కొట్టేశాడు. పర్టిక్యులర్ గా లేడీస్ సల్మాన్ స్టైల్ కు ఫిదా అయిపోయారు. యాడ్ లో సల్మాన్ డైలాగ్ డెలివరీ తో హీరోయిజం ఆటోమెటిక్ గా క్లిక్ అయిపోయింది.

 

vidya-balan-Movie still_0డర్టీ పిక్చర్ మూవీతో దుమ్మురేపిన విద్యా బాలన్ ఫస్ట్ ఫస్ట్ మిక్సీ కి ప్రమోట్ చేసింది. కూల్  గా హౌస్ వైఫ్ లా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ కు డర్టీ పిక్చర్ చూపించింది. నాలుగు నిమిషాల యాడ్స్ తో సత్తా చాటిన వారే ఇప్పుడు బీ టౌన్ ను రూల్ చేస్తున్న బడా హీరోలు, హీరోయిన్స్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy