మోడీ కేసులో వసుంధర కూడా..!

Untitledలలిత్ మోడీ వీసా వ్యవహారం… రాజస్థాన్ సీఎం వసుంధర రాజేను చుట్టుకుంది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ తో పాటు తనకు వసుంధరా రాజే కూడా హెల్ప్ చేశారన్నారు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ. ఈ ఇద్దరి మరో ముగ్గురు యూపీఏ మంత్రులు కూడా ఉన్నారన్నారు. డిసెంబర్ 2013లో వసుంధరా రాజే, తన భార్యను పోర్చుగల్‌లో క్యాన్సర్ నిమిత్తం స్వయంగా తీసుకెళ్లారన్నారు. ఈ విషయం ఎవరికి తెలియదని, తానిప్పుడు చెపుతున్నా అన్నారు. ఇండియాలో తనకు చాలా మంది రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయని చెప్పిన లలిత్ మోడీ, యూపీఏ మంత్రులు శరద్ పవార్, ప్రపుల్ పటేల్, రాజీవ్ శుక్లాల పేర్లు బయటపెట్టారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy