పొన్నాలపై ఇరకాటంలో కాంగ్రెస్!

HY24PONNALA__1819683eఅసెంబ్లీలో అసైన్డ్ భూములపై చర్చ కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసింది. పీసీసీ చీఫ్ ను అధికార పార్టీ టార్గెట్ చేసినా స్పందించలేని పరిస్థతి. సర్కార్ పై ఎదురు దాడి చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తానే ఉక్కిరిబిక్కిరైంది. అసైన్డ్ భూముల వ్యవహారంపై చర్చకు రెండు రోజులుగా ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలు,  ప్రభుత్వం దగ్గరున్న సాక్ష్యాలు చూసి అవాక్కయ్యారు.

పొన్నాల భూకబ్జా చేశారని సభలో మంత్రులు ఆరోపణలు చేస్తుంటే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిక్కురుమనలేని పరిస్థితి. పొన్నాలకు మద్దతుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన కొందరు ఎమ్మెల్యేలను వ్యతిరేక వర్గం కట్టడి చేసేందుకు ప్రయత్నించింది. ఇది మనకు సంబంధం లేని విషయమంటూ పార్టీ ఎమ్మెల్యేలకు వివరించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న సమయంలో తమ వైపు చేతులు చూపించవద్దని అభ్యంతరం వ్యక్తం  చేశారు.

ఏ చర్యకైనా సిద్ధం… 

భూముల విషయంలో  పొన్నాలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు భట్టి విక్రమార్క. అయితే  మంత్రి  హరీష్ రావు దళిత కార్డు  బయటకు తీయడంతో భట్టి సైలైంటైపోయారు. ఇక జానారెడ్డి ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. చివరకు పొన్నాల తప్పు చేశారని ప్రభుత్వం నిర్ధారణకు వస్తే ఏ చర్యకైనా సిద్ధమన్నారు. సభ అంతా ఒన్ సైడ్ అయ్యాక ఎమ్మెల్యే సంపత్  దళితులను వస్తువులుగా వాడుకుంటున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు.  సంపత్ కు జానా రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. టోటల్ గా ల్యాండ్స్ ఇష్యూలో సర్కార్ ను ఇరకాటంలో పెట్టాలనుకున్న కాంగ్రెస్ చివరకు తానే బుక్కైంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy