ఇరకాటంలో యువరాజ్ సింగ్

1392185413-540x198ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారయ్యింది క్రికెటర్ యువరాజ్ సింగ్ పరిస్థితి. ఐపీఎల్ వేలంలో అత్యధిక పారితోషకం అందుకున్న యువీకి ఇప్పడు అదే పెద్ద తలనొప్పిగా మారింది. యువీ ఆడుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓనర్ విజయ్ మాల్యా ఆఫర్ ను అంగీకరించకూడదంటూ కింగ్ ఫిషర్ ఉద్యోగులు అతనికి లెటర్ రాసారు. తమకు గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న విజయ్ మాల్యా టీం తరుఫున యువరాజ్ ఆడకూడదని లేఖలో యువీకి విజ్ఞప్తి చేశారు.

తమకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని మొండిచేయి చూపించిన విజయ్ మాల్యాకు ఐపీఎల్ లో కోట్లు పెట్టి ఆటగాళ్ళను కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు కింగ్ ఫిషర్ ఉద్యోగులు. పైగా అభిమానులుగా తాము కోరుతున్నామని….అంగీకరించాలని మెలిక పెట్టారు. అసలే ఫామ్ లో లేక, అవకాశాలు రాక సతమతమవుతున్న యువరాజ్ కు ఈ లెటర్ ఆశనిపాతంలా తగిలింది.

దీంతో యువరాజ్ అయోమయంలో పడ్డాడు. డబ్బులు కోసం కాకపోయినా ఐపీఎల్-2014 యువరాజ్ కెరీర్ కు చాలా ముఖ్యం. ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్థానం కోసం యువీకి ఐపీఎల్ పెద్ద ప్లాట్ ఫాం. ఇక్కడ బాగా ఆడి తర్వాత టీమ్ లో చోటు సంపాదించాలని యువీ అనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు కింగ్ ఫిషర్ ఉద్యోగుల కోరిక మేరకు రాయల్ ఛాలెంజర్స్ తరుఫున ఆడడం మానేస్తే అతని కెరీర్ కు పెద్ద దెబ్బే తగులుతుంది.

యువరాజ్ ని కూడా ఈ విషయమే ఎక్కువగా ఆలోచింపజేస్తోంది. ఇక యూవీ తీసుకునే నిర్ణయంపైనే అతని భవిష్యత్ ఆధారపడి ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy