ఇరాక్ లో భారీగా బయటపడ్డ ఐసీస్ సొమ్ము

isis moneyఇరాక్ లోని మోసుల్ నగరంలో… ISIS స్థావరాలపై అమెరికా వరుస దాడులు చేస్తోంది. ఇది మామూలు విషయమే అయినా… మొన్న జరిగిన ఓ అటాక్ లో ఉగ్రవాదుల పెద్ద ఎత్తున దాచుకున్న డబ్బు బాంబు దాడిలో ధ్వంసమైంది. 900 కేజీల బరువున్న రెండు భారీ బాంబులను వేయడంతో ఓ బిల్డింగ్ పేలిపోయింది. అందులో నోట్ల కట్టలు గాల్లో లేచాయి. వాటి విలువ కొన్ని కోట్లుండొచ్చని అనుమానం. నాసా సాటిలైట్ లో నోట్ల కట్టలు ఎగిరిన సీన్స్ రికార్డయ్యాయి. దాన్ని అమెరికాకు చెందిన పెంటాగాన్ రిలీజ్ చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది. సిరియా, ఇరాక్ లలో ISIS ఉగ్రవాదుల పెద్ద ఎత్తున బ్యాంకులను లూటీ చేశారు. అలాగే పెట్రో బావులను ఆక్రమించి.. ఆయిల్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ డబ్బునే ఉగ్రవాద కార్యకలాపాలకు సప్లై చేస్తున్నారు. అయితే లెటెస్ట్ ఇన్సిడెంట్ ISIS పెద్ద దెబ్బేనంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy