ఇర్ఫాన్ ను దూరం పెట్టిన పాకిస్థాన్ బోర్డు..

download (1)పాకిస్థాన్ టాల్ అండ్ టాప్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దూరం పెట్టింది. అతన్ని దూరంగా ఉంచాలని పాకిస్థాన్ టీం మేనేజ్ మెంట్ డిసైడ్ అయ్యింది. గాయం కారణంగా ఇర్ఫాన్ ను తాజాగా జరిగే వన్డే,  ట్వి-20లకు టీంలో ప్లేస్ కల్పించలేదు. టీం కోజ్ వాగర్ యూనిస్ కూడా అతన్ని పిలిచి ఫిట్ నెస్ టెస్ట్ జరిపారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ఇర్ఫాన్ పిట్ నెస్ పై దృష్టి పెట్టాలని..త్వరలో జరిగే లోకల్ మ్యాచ్ ల్లోపు ఫిట్ నెస్ సాధిస్తాడని ఆయన అన్నారు.

టాల్ బౌలర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన కోసం షెడ్యూల్ ప్రిపేర్ చేసిందని..అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో హోం గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ లకు సిద్దమౌతానని..ఫిట్ నెస్ సాధిస్తానని చెప్పాడు. వచ్చే వరల్డ్ కప్ కోసమే అతనికి రెస్ట్ ఇస్తున్నారని…పీసీబీ వర్గాలు చెప్తున్నాయి. ఇర్ఫాన్, ఉమర్ గుల్ ఇద్దరిని శ్రీలంకతో జరిగే టెస్ట్, వన్డే మ్యాచ్ లకు ఫిట్ నెస్ కారణంతో మేనేజ్ మెంట్ టీంలో చోటు కల్పించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి ఇర్ఫాన్ టీంకు అడటం లేదు. తొడ గాయం కారణంగా అప్పటి నుంచి టీంకు దూరంగానే ఉంటున్నాడు. గత కొంత కాలం పాకిస్థాన్ టీం వరల్డ్ క్లాస్ ప్లేయర్లను టీం నుంచి కోల్పోతుంది. స్పాట్ ఫిక్సింగ్ ల కారణంగా అమీర్, అసిఫ్ లను కోల్పోయింది. 2011 వరల్డ్ కప్ తర్వాత షోయబ్ అక్తర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తర్వాత ఉమర్ గుల్ టీంలోకి వచ్చినా…ప్రస్తుతం మోకాలి గాయంతో టీంలో చోటు కోల్పోయాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy