ఇల్లీ ఎంగేజ్ మెంట్ అయ్యిందా?

2ఇలియానా డిసౌజా – ఆండ్రూ ఇద్దరూ చాలాసార్లు చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. మంచి ఫ్రెండ్స్ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే నిజమో.. అబద్దమోగానీ.. ఇటీవల అంటే.. నెల రోజుల క్రితం ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ అయ్యిందని సమాచారం. గోవాలోని ఓ చర్చిలో కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, బంధువుల సమక్షంలో రింగ్స్ మార్చుకున్నట్లు బాలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆండ్రూ.. ఇలియానా చిన్ననాటి స్నేహితుడు. ఆస్ట్రేలియాలో ఫొటోగ్రాఫర్.  ఆ నోటా.. ఈ నోటా ఈ విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నా.. బయటకు చెప్పటానికి మాత్రం నోరు తెరవటం లేదు ఈ గోవాబ్యూటీ. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ కుంగ్ ఫూ యోగాలో జాకీచాన్ పక్కన నటిస్తోంది. మరో మూడు నెలలు దుబాయ్, హాంకాంగ్, ఇండియాలో జరుగుతుంది. ఆ తర్వాత అందర్నీ పిలిచి గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. ఆడోళ్ల మాటలకు అర్థాలే వేరులే అంటారు.. ఇక హీరోయిన్ మాటలు అయితే ఎటైనా తిరగొచ్చు.. వెయిట్ అండ్ సీ…

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy