ఇవాంకా కోసం లాడ్‌ బజార్‌ ముస్తాబ్

ivankaచారిత్రాత్మక  భాగ్యనగరం మరో  అంతర్జాతీయ వేడుకలకు సన్నద్ధమవుతున్న వేళ….పాతబస్తీలోని లాడ్‌బజార్‌  ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది.     మహ్మద్‌ కులీకుతుబ్‌షా  గారల పట్టి హయాత్‌ బక్షీ  కోసం  అప్పట్లో  ఏర్పాటు చేసిన చుడీబజార్‌ (లాడ్‌ బజార్‌)  ఇప్పుడు   అగ్రరాజ్య అధినేత  డోనాల్డ్‌ ట్రంప్‌  ముద్దుల  కూతురు   ఇవాంకా సందర్శన కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ముత్యాలు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను  ప్రతిబింబించే గాజులకు  నెలవైన హైదరాబాద్‌ లాడ్‌బజార్‌  ప్రత్యేక ఆకర్షణగా  మారింది. ఇవాంక మనస్సు దోచుకొనే  రకరకాల డిజైన్‌ గాజులతో  దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్క గాజులే కాకుండా  వెరైటీ వస్త్రాలు, ఆభరణాలు, శతాబ్దాలుగా మగువల మదిని దోచుకుంటున్న డిజైన్‌లు  ఇవాంకా కోసం పాతబస్తీలో  ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో  భాగంగా   ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందుకు  హాజరుకానున్న  ఇవాంకా  పాతబస్తీలోని లాడ్‌బజార్‌ను సైతం సందర్శించవచ్చుననే సమాచారంతో  ప్రభుత్వం  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

ఇవాంకకు స్పెషల్ గాజులు  
ఈ  సందర్బంగా లాడ్‌ బజార్‌లోని ఖాజా బ్యాంగిల్‌ స్టోర్‌ యజమాని మహ్మద్‌ అన్వర్‌ భారత జాతీయ జెండా, అమెరికా దేశ పతాకం రంగులతో నెల రోజుల పాటు శ్రమించి అద్భుతమైన  గాజుల పేరును  తయారు చేశారు.  హైదరాబాదీ లక్క బ్యాంగిల్స్‌  తరహాలో తయారు చేసిన ఈ గాజులలో   కట్‌ గ్లాస్‌ స్టోన్‌ను సెట్‌లో అమర్చారు. ఇవాంక  ట్రంప్‌ లాడ్‌ బజార్‌ సందర్శనకు  వస్తే భారత, అమెరికా దేశ పతాకాలతో రూపొందించిన గాజుల సెట్‌ను బహూకరించనున్నట్లు  అన్వర్‌ తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy