ఇవాంక కోసం.. వైట్ హౌజ్ నుంచే బలగాలు: మన మీద నమ్మకం లేకనేనా.?

ivanka-trumpఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భద్రత చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌజ్ భద్రతా కార్యాలయం జారీ చేస్తున్న ఆదేశాలు ప్రధాని భద్రతా కార్యాలయాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.  ఇవాంక భద్రతను తమకు వదిలేయాలని.. ఆమె సెక్యురిటీ అంతా తాము చూసుకుంటామంటూ కేంద్ర హోంశాఖతోపాటు ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌)కు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో HICCలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఇవాంక ట్రంప్‌ భద్రతతో పాటు దేశ ప్రధాని మోడీ భద్రత కూడా ముఖ్యమని, ఆయన వెనక  ఆర్మ్‌డ్‌ సిబ్బంది ఉండాలని పట్టుబడుతున్నాయి కేంద్ర హోంశాఖతో పాటు ఎస్‌పీజీ. గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్‌ కాల్పుల వ్యవహారంతో అమెరికన్‌ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంక ట్రంప్‌ భద్రతకు సంబంధించి అమెరికన్‌ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు సమాచారం.

అదేవిధంగా సదస్సు బయటే ఎస్‌పీజీ, కేంద్ర రాష్ట్ర పోలీస్‌ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికన్‌ వైట్‌హౌస్‌ కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసినట్టు రాష్ట్ర పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy