ఇవాంక ట్రంప్  ప్రొఫైల్

ivanka-profileడొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య, మోడల్ అయిన ఇవానా రెండో కూతురే ఇవాంక మరియా ట్రంప్. డొనాల్డ్  ట్రంప్, ఇవానా 1991లోనే విడాకులు తీసుకున్నారు. అప్పటికి ఇవాంక వయసు పదేళ్ళు.  ఆమెకు 15యేళ్ళ వచ్చేవరకూ మన్ హట్టన్ లోనే చదువుకున్నారు.  ఆ తర్వాత కనెక్టికట్ లోని బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు.  చోయేట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇవాంక… 2004లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనమిక్స్ లో లో డిగ్రీ పూర్తి చేశారు.

కనెక్టికట్ లో స్కూలింగ్ లో ఉండగా.. 14యేళ్ళ వయస్సులో ఇవాంక మోడలింగ్ లో జాయిన్ అయ్యారు.  ఏడాదిలోనే ప్రముఖ మేగజీన్స్ లో ఆమె ఫొటోలు పబ్లిష్ అయ్యాయి.  క్యాట్ వాక్ షోస్ లతో ఇవాంక పాపులర్ అయ్యారు. అప్పట్లోనే యాడ్ ఫిలింల్స్లో నటించి యువతరానికి బ్యూటీ ఐకన్ గా మారారు ఇవాంక.

ఇవాంక మొదట్లో పేరు మాత్రమే. కానీ కొద్దిరోజుల్లోనే బ్రాండ్ గా మారిపోయింది. ఇవాంక డిగ్రీ పూర్తైన వెంటనే 2005లో ఆమె ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయింది.  మొదట డైమండ్ బిజినెస్ లో… తర్వాత గోల్డ్ జ్యుయలరీ వ్యాపారం చేశారు ఇవాంక.  బట్టలతో పాటు యాక్సెసరీస్ ను రూపొందించారు. ఇవాంక పేరుతోనే షూస్, జ్యుయలరీతో పాటు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ ను మార్కెట్లోకి తెచ్చారు. 2015 లోనే వంద మిలియన్ డాలర్లను  బిజినెస్ లో సంపాదించిందంటే … ఆమె కలెక్షన్స్ కు అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. చైనాలో కూడా ఇవాంక కలెక్షన్స్ కు కాసుల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆమె బిజినెస్ చైనాలో విజయవంతంగా నడుస్తోంది.

ఒక్క ఫ్యాషన్ రంగంలోనే కాదు… తండ్రి డొనాల్డ్ ట్రంప్ కు చెందిన అనేక వ్యాపారాలను ఆమె నిర్వహించారు. లిక్కర్ బిజినెస్ తో పాటు గోల్ఫ్స్ క్లబ్స్, రిసార్ట్స్, హోటల్స్ లాంటి బిజినెస్ లను ఇవాంక నడిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వ్యాపారాల నుంచి డొనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. కొన్నాళ్ళు ఇవాంకే ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వైట్ హౌస్ లో అడ్వైజర్ గా జాయిన్ అవడంతో బిజినెస్ లను నమ్మకస్తులకు, కుటుంబసభ్యులకు అప్పగించారు ఇవాంక ట్రంప్.

ఇవాంక 2009లో యూదు మతానికి చెందిన జారెద్ కుష్నర్ ను పెళ్ళి చేసుకున్నారు. తర్వాత యూదు మతంలోకి మారారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు. వీళ్ళల్లో అరబెల్లా పెద్దకూతురు. ఐదేళ్ళ వయస్సులోనే తల్లిలాగే ఎన్నో అద్భుతాలు చేస్తోంది అరబెల్లా. చైనా అధికార భాష మాండరిన్ లో… వాళ్ళ సంప్రదాయ గీతాన్ని పాడిన అరబెల్లా చైనా అధ్యక్షుడితో పాటు కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy