ఇవాంక పర్యటన.. ఎవరూ బయటకు రాకండి

ivanka-trumpఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌజ్ సలహాదారురాలు ఇవాంక ట్రంప్ ఈ నెల 28న హైదరాబాద్ వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. ఆమె వచ్చిన రోజూ ఎవరూ బయటకు రావొద్దని.. ఏకంగా ప్రచారం చేస్తున్నారంటే.. భద్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ‘‘అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు. ఆ రోజు ఎవరూ ఇంట్లోంచి బయటకు రావద్దు. అత్యవసర పనులుంటే మాకు చెప్పండి.’’ అంటూ ఫలక్‌నుమా ప్యాలెస్‌, మాదాపూర్‌లోని వెస్టిన్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు పోలీసులు.

అసాధారణ భద్రత:

ఇవాంక బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌కు నలువైపులా కిలోమీటరు దూరం వరకూ ఉన్న వాణిజ్య సంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ సంస్థల యజమానులు, ప్రతినిధులతో మాదాపూర్‌ పోలీసులు శనివారం సమావేశమయ్యారు.

ఇదిలా ఉంటే  ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ నెల 28న ప్రధాని మోడీ, ఇవాంక, జీఈఎస్‌ సదస్సు ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు వట్టేపల్లి, సాదిక్‌నగర్‌, ఫాతిమా నగర్‌, ఫలక్‌నుమా ప్రాంతాల్లో ఇళ్లు, మురికివాడలను శనివారం పరిశీలించారు. ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేశారు. ప్రతి ఇంట్లో సభ్యులెందరు? ఏం చేస్తున్నారు? ఎవరైనా విదేశాలకు వెళ్లారా? పదిరోజుల్లో వెళ్లనున్నారా? అన్న వివరాలూ సేకరించారు. రెండు, మూడు నెలల క్రితం నుంచి అపరిచితులకు ఎవరైనా ఇల్లు అద్దెకు ఇచ్చారా? ఈ నాలుగైదు రోజుల్లో ఎవరైనా బంధువులు వచ్చారా? అన్నదీ ఆరా తీశారు. ఎవరైనా అలా వచ్చి ఉంటే.. వారి వివరాలు తీసుకున్నారు. ఇళ్లలోని వారెవరూ 28న బయటికి రావద్దని విన్నవించారు.  

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy