ఇవాంక రాక వెనక ఆంతర్యమేమిటి.?

Ivanka-Trumpఇవాంక… యావత్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. అమెరికాలాంటి  పెద్ద దేశానికి ప్రెసిడెంట్ కూతురు ఆమె. అంతకంటే ముఖ్యంగా ప్రెసిడెంట్ అడ్వైజర్ గా వైట్ హౌస్ లో చేరినప్పటి నుంచి ఆమె దేశ, విదేశీ వ్యవహారాల్లో కీలకంగా మారింది.  ఇప్పుడు హైదరాబాద్ కి వస్తోన్నఆమె ఎలాంటి కీ రోల్ పోషించబోతోంది… లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ అయిన ఇవాంక…. దేశ, విదేశీ వ్యవహారాల్లో కీరోల్ పోషిస్తోంది.  అమెరికాకి ఐక్యరాజ్యసమితికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.  ప్రపంచాన్ని కుదిపేస్తున్న లింగ వివక్ష, మానవుల అక్రమ రవాణా, శరణార్ధుల సమస్యలతో పాటు మహిళల సాధికారత లాంటి కీలక అంశాల ఆమె విలువైన సలహాలను ఇస్తోంది.

హ్యూమన్ ట్రాఫికింగ్ పై సెప్టెంబర్ లో UN లో కీలక ఉపన్యాసం చేశారు ఇవాంక.  ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లమందిని తరలిస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నారనీ… మహిళలను అయితే సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని అన్నారు.  ఇలా వెట్టి చాకిరీ చేస్తున్న వారిని రక్షించడానికి, మహిళలకు అండగా ఉండేందుకు ఇవాంక ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోరాటం చేస్తున్నారు.  దీనిపై అన్ని దేశాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఒక్క UNలోనే కాదు… ఎక్కడ ప్రపంచ సదస్సులు జరిగినా ఈ అంశాల్ని ఆయా దేశాల దృష్టికి తెస్తున్నారు.

ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనకు వచ్చినప్పుడు… ట్రంప్ కంటే ముందే ఆయా దేశాల్లో పర్యటించి … మహిళా సాధికారత, మానవుల అక్రమ రవాణాపై చర్చలు జరిపారు ఇవాంక.  మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలన్నది ఆమె లక్ష్యం. అందుకోసం వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు.. పనిలో నైపుణ్యం పెంచుకునేందుకు… శిక్షణ ఇప్పించాలని కూడా ఇవాంక పిలుపు ఇస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే US గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో కూడా ఇవాంక ఎజెండా ఇదే.  హైదరాబాద్ టూర్ కన్ఫమ్ అయ్యాక ఆమె విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశం అయ్యారు. సెప్టెంబర్ లో UN భద్రతామండలి సమావేశాల్లో పాల్గొనడానికి సుష్మా స్వరాజ్ న్యూ యార్క్ వెళ్ళినప్పుడు ఆమెతో… హైదరాబాద్ మీటింగ్ అంశాలపై చర్చించారు.  ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తల అంశంపైనే వీళ్ళమద్య చర్చ జరిగింది.

హైదరాబాద్ సదస్సులో మొత్తం 12 వందల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. వీళ్ళల్లో ఇండియా నుంచి 400 మంది ఉండగా, అమెరికా సహా మిగిలిన దేశాల నుంచి 800 మంది హాజరవుతున్నారు.  ఈ 400 స్లాట్స్ కోసం ఏకంగా 40 వేల మంది భారతీయ పారిశ్రామికవేత్తలు అప్లయ్ చేశారు. దీన్నిబట్టే ఇవాంకకి భారతీయ పారిశ్రామికవేత్తలు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో తెలుస్తోంది.  ఈ సదస్సుకు 12వందల మంది పారిశ్రామికవేత్తలతో పాటు 300 మంది పెట్టుబడిదారులు, అధికారులు కలిపి 15 వందల మంది దాకా పాల్గొనే అవకాశం ఉంది.

మొదట వాషింగ్టన్ లో మొదలైన ఈ సదస్సు ఇస్తాంబుల్, దుబాయ్, మొరాకో తదితర దేశాల్లో జరిగింది. మొదటిసారి భారత్ లో ఈ సదస్సు జరుతుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ సదస్సులో ఇవాంక మొదటి ప్రాధాన్యత కూడా మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించడం మీదనే ఉండబోతోంది.  సదస్సు థీమ్ కూడా ఇదే.      Women first, prosperity for all… 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy