ఇవాల్టికి వెళ్లిపోయారు : చాంబర్ కు ఒకే ఒక్క రోజు టైం ఇచ్చిన పవన్

pawan-1dayఫిల్మ్ చాంబర్ నుంచి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్. తన తల్లిపై వ్యాఖ్యలు చేసిన, చేయించిన వారిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఐదు గంటలు అక్కడే బైఠాయించారు. దీనికి మెగా హీరోలు అందరూ మద్దతుగా తరలించారు. ఈ సమయంలో ఫిల్మ్ చాంబర్ కు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తోపులాట జరిగింది. గందరగోళంగా మరింది. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన పోలీసులు.. ఫిల్మ్ చాంబర్ నుంచి వెళ్లిపోవాలని.. లేదంటే పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని సూచించడంతో  అక్కడి నుంచి వెల్లిపోయారు పవన్. పవన్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లిపోయింది.

ఈ క్రమంలోనే చాంబర్ కు ఒకే ఒక్క రోజు సమయం ఇచ్చారు పవన్ కల్యాణ్. ఏప్రిల్ 21వ తేదీ శనివారం ఉదయం 10 గంటలలోపు చాంబర్ నుంచి సమాధానం కావాలని.. లేకపోతే భవిష్యత్ కార్యరణ ప్రకటిస్తానని వెల్లడించారు. పవన్‌కు అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, బండ్ల గణేష్, బన్నీ వాసు, హైపర్ ఆది, కృష్ణుడు, శివబాలాజీ,  తమ సంఘీభావాన్ని తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy