ఇవాల్టి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు

 తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాల్టి నుంచి గురువారం(23వ తేదీ) వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్. పవిత్రోత్సవాలకు అంకురార్పణం సందర్భంగా సోమవారం శ్రీవారి మూల విరాట్ ఎదుట జరిగిన ఆచార్య రుత్విక్‌వరణం కార్యక్రమంలో సింఘాల్ పాల్గొన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగాని, సిబ్బంది వల్లగాని తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు సింఘాల్. ఉత్సవాల్లో తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారన్నారు. మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ మూడు రోజులపాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy