ఇవాళ,రేపు రాష్ట్రంలో రాహుల్ పర్యటన

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ (సోమవారం,ఆగస్టు-13) రేపు(మంగళవారం,ఆగస్టు-14) తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగనున్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. టూర్లో రాహుల్ అన్ని వర్గాలను కలిసేలా వేర్వేరుగా సభలు ఏర్పాట్లు చేశారు పీసీసీ నేతలు. 3 గంటల నుంచి 4 గంటల వరకు శంషాబాద్ లోని  క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్లో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమవుతారు. 5.30 నుంచి 7 గంటల వరకు శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. రాత్రి హోటల్ హరిత ప్లాజాలో బస చేస్తారు.

రేపు(మంగళవారం) ఉదయం 9.30 నుంచి 10.30 వరకు హరిత ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు రాహుల్. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. పదిన్నర నుంచి పదకొండున్నర వరకు మీడియా ఎడిటర్స్ తో ఇంటరాక్ట్ అవుతారు. 12 గంటలకు పరిశ్రమల సీఈవోలతో భేటీ అవుతారు. 3.30 కు గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. 5 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో పాల్గొంటారు రాహుల్.

రాహుల్ రాష్ట్ర పర్యటన చరిత్రలో నిలిచిపోతుందన్నారు PCC చీఫ్. కాంగ్రెస్ లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. సరూర్ నగర్ బహిరంగసభ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు ఢిల్లీ బయల్దేరతారు రాహుల్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy