ఇవాళే పాలీసెట్ – 2017 రిజల్ట్స్

polycetపాలీసెట్ – 2017 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఫలితాలను www.sbtet. telangana.gov.in వెబ్‌ సైట్‌లో పొందవచ్చు. దీంతోపాటు గతేడాది నిర్వహించిన ఎంసెట్, ఐసెట్, పాలీసెట్‌లో ఏ ర్యాంకు వారికి ఏ కాలేజీలో సీటొచ్చిందనే వివరాలతో కూడిన సీడీని శనివారం కడియం శ్రీహరి విడుదల చేస్తారు. ఈ నెల చివరలో ప్రారంభం కానున్న ఆయా ప్రవేశాలలో విద్యార్థులకు ఉపయోగపడేలా సాంకేతిక శాఖ ఈ సీడీని రూపొందించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy