ఇవాళ్టి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ssc-examsఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 23 వరకు ఇవి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. నిర్ణీత పరీక్షా సమయం ఉదయం 9 గంటలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని బోర్డు సెక్రటరీ అశోక్‌ తెలిపారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకిఅనుమతిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,78,290 మంది పరీక్షకు హాజరు కానున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy