ఇవాళ్టి నుంచి హాంకాంగ్ బ్యాడ్మింటన్ సిరీస్

కోవ్‌ లూన్: ఇవాళ్టి నుంచి హాంకాంగ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ గేమ్ లో..హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ .. సింధు, శ్రీకాంత్ సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు. మంగళవారం(నవంబర్-13) నుంచి జరిగే ఈ టోర్నీలో సైనాకు కఠినమైన డ్రా ఎదురైంది. తొలిరౌండ్‌ లో జపాన్ స్టార్ , ప్రపంచ రెండో ర్యాంకర్ అకానే యమగుచితో తలపడనుంది.

థాయిలాండ్‌ కు చెందిన జిందాపోల్‌ తో సింధు…తొలిరౌండ్‌ లో అమీతుమీ తేల్చుకోనుంది. సింధుకు క్వార్టర్స్‌ లో బింగ్జియావో రూపంలో పెను ప్రమాదం ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో స్థానిక షట్లర్ , హాంకాంగ్‌ కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌ తో కిడాంబి శ్రీకాంత్ తలపడనున్నాడు. భారత్‌ కే చెందిన HS ప్రణయ్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే శ్రీకాంత్‌ తో తలపడాల్సి ఉంటుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy