ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మైనింగ్ సదస్సు

MINING-TODAYహైదరాబాద్ హైటెక్స్ లో బుధవారం (ఫిబ్రవరి-14) అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు జరగనుంది. ఖనిజాల అన్వేషణలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులపై నాలుగురోజుల పాటు చర్చిస్తారు. మైనింగ్ విజన్ 2040 తయారీ లక్ష్యంగా  జరిగే ఈ సదస్సుకు.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతోపాటు.. దేశంలోని ఐదు వందల మంది మైనింగ్ నిపుణలు హాజరవుతారు. సదస్సును తెలంగాణ ప్రభుత్వం, ఫిక్కీ, మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి. ఐటెక్స్  వేదికగా బుధవారం సాయంత్రం మొదలయ్యే సదస్సుకు కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ , గవర్నర్ నరసింహన్, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతారు. ఈ సదస్సు ఫిబ్రవరి-14 నుంచి 17 వరకు జరగనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy