ఇవాళ అంధుల టీ20 వాల్డ్ కప్ ఫైనల్

blind india teamఅంధుల టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశలో పాక్  చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరి చేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ లోనూ ఓడని పాకిస్తాన్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. శనివారం జరిగిన రెండో సెమీస్‌లో పాక్ 147 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy