ఇవాళ గజ్వేల్ లో సీఎం పర్యటన

cmkcr-610అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లాలో తూఫ్రానులోనూ ఆయన వంద పడకల హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు, మర్కూక్ గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడనున్నారు సీఎం.

ఇవాళ మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని తూఫ్రాన్, గజ్వెల్ లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 102 వైద్య సర్వీసులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత తూఫ్రాన్ వెళ్తారు. పదకొండున్నరకు 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గజ్వేల్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంటా 50 నిమిషాల వరకు అభివృద్ధి పనులను పరిశీలిస్తారు కేసీఆర్.

డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆడిటోరియం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, 100 పడకల దవాఖాన, ఎమ్మెల్యే కార్యాలయ భవనం, ఎడ్యూకేషన్ హబ్ ఇలా పలు  నిర్మాణపనులు చూస్తారు సీఎం. 2 గంటల 10 నిమిషాలకు మర్కూక్ గ్రామ ప్రజలతో మాట్లాడతారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తారు. ఆ తర్వాత 3 గంటల 10 నిమిషాలకు ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy