ఇవాళ జాతిపిత జయంతి

Mahatma-Gandhi-Jayanti-2013-HD-Wallpapers-Images-Pics-Free-Download-2nd-Octoberసూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమట దారిని చూపిన క్రాంతి.. తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్చా భానుడి ప్రభాత కాంతి గాంధీ. మహాత్ముడికి తెలిసింది ఒక్కటే. ఎక్కడ వివక్ష ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడడం… సత్యం, అహింసల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకపోవడం… ఒక్కో చినుకు గాలివానగా మారినట్టు…ఆయన ఒక్కో అడుగు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కోటలను బీటలు వారేలా చేసింది.   గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2 న  గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. చిన్నతనం నుంచే గాంధీజీలో అధ్యాత్మిక భావాలు ఎక్కవ.  13 ఏళ్ల వయస్సులో కస్తూరిబాతో బాపూజీకి వివాహ మయింది. 1888 లో న్యాయశాస్త్ర విద్య చదివేందుకు  లండన్ వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చాక ముంబాయి కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.. ఓ కేసు వాదించేందకు దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీ 21 ఏళ్లు అక్కడే ఉండిపోయారు. అక్కడ తనకు ఎదురయిన చేదు అనుభావాలు చరిత్ర గతిని మార్చగలిగిన గొప్ప నేతగా  గాంధీజీని తయారు చేశాయి.

800px-Gandhi_spinning-ED భారతీయుల ఆత్మగౌరవం కోసం దక్షిణాఫ్రికాలోశాసనోల్లంఘణోద్యమం  చేపట్టి సక్సెస్ అయ్యారు  గాంధీజీ. 40 ఏళ్ల వయస్సులో దేశానికి తిరిగొచ్చిన బాపూజీ … సేవా కోసం  అహ్మాదాబాద్  లోని  సభర్మతి దగ్గర ఆశ్రమం స్థాపించారు. 1919లో బ్రిటీషు సైనిక అధికారి జనరల్ డైయర్ ప్రజలపై కాల్పులు జరపడం … జలియన్ వాలా బాగ్ మారణ కాండ .. గాంధీజీ రాజకీయాల్లోకి వచ్చేందుకు కారణమయ్యాయి. సహాయ నిరాకరణ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని చెప్పిన గాంధీజీ … బ్రిటీసు వాళ్లు దేశం నుంచి వెళ్లే వరకు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారు. సత్యాగ్రహ ఉద్యమం, కైరా సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం, నిరాకరణోద్యమం, శాసనోల్లంఘనం, బార్డోలి సత్యాగ్రహం, సైమన్ కమిషన్ రాక బహిష్కర్కరణ, ఉప్పుసత్యాగ్రహం, దండి యాత్ర, క్విట్ ఇండియా గాంధీజీ చేపట్టిన ఉద్యమాల్లో  ముఖ్యమైనవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  హిందూ-ముస్లింల మధ్య శాంతి కోసం కలకత్తాలో నిరాహారదీక్ష చేశారు గాంధీజీ. ఉత్తర పంజాబు, బెంగాల్ లలో జరుగుతున్న హింసాత్మక చర్యలు ఆపాలంటూ  ఆమరణనిరాహార దీక్ష చేపట్టారు. 1948 జనవరి 30న గాడ్సే జరిపిన కాల్పుల్లో మహాత్ముడు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామాలు స్వయం సంమృద్ధి సాధించినప్పుడే   దేశం ఆర్ధికంగా  బలపడుతుందనేవారు  గాంధీజీ.  గ్రామస్వరాజ్యం కలలు కనేవారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy