ఇవాళ తాపీ ధర్మారావు జయంతి

81379582862_625x300పవిత్రంగా చూసుకునే ఆలయాలపై అసభ్యమైన బొమ్మలు ఎందుకుంటాయి? ఈ ప్రశ్న వినగానే గుర్తొచ్చే వ్యక్తి తాపీ ధర్మారావు. ఆయన పుట్టింది ఈరోజే. రచయితగా, తెలుగు పండితుడుగానే కాదు హేతువాదిగా, నాస్తికుడిగా తెలుగు సమాజంపై చెరగని ముద్ర వేశారు ధర్మారావు. ఆలయాలపై బూతుబొమ్మలేంటని ఆయన ప్రశ్నించడం సంచలనం రేపింది. ఆ పేరుతో ఏకంగా పుస్తకమే రాశారాయన. తాతాజీగా అందరూ ముద్దుగా పిలుచుకునే ఈయన తెలుగు వ్యవహారభాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారి ప్రియశిష్యుడు. తెలుగు భాషను ప్రాణంగా భావించిన ధర్మారావు 1910లో బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. 1911లో రాసిన ఆంధ్రుల కొక మనవి… ఆయన తొలి రచన. ఇనుప కచ్చడాలు, పెళ్లి పుట్టుపూర్వోత్తరాలు, కొత్త పాళి, పాతపాళి లాంటి రచనలు చేశారు. పత్రిక నిర్వహణలోనూ తన ముద్రవేశారు. మాలపిల్ల, రైతుబిడ్డ, ద్రోహి లాంటి అనేక సినిమాలకు డైలాగ్స్ రాశారు. 1943లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం తొలి సమావేశానికి అధ్యక్షత వహించారు.  తన రచనలతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1926లో ఆంధ్రవిశారద, 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. జర్నలిస్టుగా, రచయితగా, భాషాపండితుడిగా, హేతువాదిగా, సంస్కర్తగా తెలుగు సమాజానికి ఎన్నో సేవలు చేశారు. తాపీ ధర్మారావు… 1973లో చనిపోయారు. ఆయన జయంతిని తెలుగు భాషాభిమానులు.. తెలుగు మాధ్యమ దినోత్సవంగా(తెలుగు మీడియా డే) జరుపుకుంటున్నారు.

1113807165_0ae80cbd67

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy