ఇవాళ నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్

nandyalనంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు  గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో సోమవారం (ఆగస్టు 28న) ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది.

ఇటీవల నంద్యాలలో చోటు చేసుకున్న రెండు పార్టీల ఘర్షణల కారణంగా పట్టణంతో పాటు, కౌంటింగ్‌ కేంద్రం దగ్గర పోలీస్‌ బలగా లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను అలర్ట్  చేశారు. ఫలితాల తర్వాత కూడా ఎటువంటి గొడవలు జరకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో 30 పోలీస్‌ యాక్టు, సెక‌్షన్‌ 144 అమలు చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఒక అదనపు  SP, 5 గురు DSPలు,17 మంది CIలు, 38 మంది SIలు,74 మంది ASI లు,260 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు,44 సెక్షన్ల ఎఆర్‌ కానిస్టేబుళ్లు,10 ప్రత్యేక బృందాలు,ఒక కంపెనీ సిఆర్‌పిఫ్‌ దళం,ఐదు ప్లాటూన్ల APSP పోలీసులు బందోబస్తులో ఉంటారు. ఇక కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పడు రౌండుల వారీగా ఫలితాలను పోలింగ్‌ కేంద్రం ఎదుట ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి స్క్రీన్‌ ద్వారా మీడియాకు, ప్రజలకు తెలియజేస్తారు.

మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు (పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 250) జరుగుతుంది. తర్వాత EVM ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 9.30 గంటల్లోగా ఎవరు ఆధిక్యంలో ఉన్నారో తెలిసిపోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితం వచ్చే అవకాశముంది.

ఓట్ల లెక్కింపు సందర్బంగాTDP, YCP నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం (ఆగస్టు 28) నంద్యాలకు తరలి వచ్చారు.  ఫలితాలు ఇవాల తెలవనున్నాయి. దీంతో టీడీపీ ముఖ్యనేతలు మం త్రి కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌ యాదవ్‌ నంద్యాల వచ్చారు. అలాగే YCP నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు నంద్యాలకు చేరుకున్నారు.

TDP అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, YCP అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy