ఇవాళ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు

TRAFICహైదరాబాద్ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా పాతబస్తీలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.  ఇవాళ(మంగళవారం,జూన్-5) జరిగే ఈ ర్యాలీ చార్మినార్ దగ్గర ప్రారంభమై చార్‌కమాన్ మీదుగా మజీద్ ఈ ఇమామియా, గుల్జార్ హౌస్, పత్తార్‌ఘట్టి, మదీన, టిప్పుఖాన్ బ్రిడ్జీ, చెత్తబజార్, లక్కడ్ కోట్, సలామ స్కూల్, పురానహవేలి, ఏపీఏటీ ఎక్స్‌రో డ్స్, దారుషిఫా గ్రౌండ్స్, ఎస్‌జే రోటరీ, అలీఖాన్ ఐ దవాఖాన, మజీద్ ఈ ఇమామియా వరకు కొనసాగుతుందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి  రాత్రి 8 గంటల వరకు ర్యాలీ కొనసాగే చార్మినార్ నుంచి కాలీకబర్ ఎంజీబీఎస్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సీపీ తెలిపారు. వాహనదారులు  సహకరించి …ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy